House Warming 25 Aster Way

గృహ ప్రవేశం 25 ఆస్టర్ వే

January 31, 2026 4:31 PM జనవరి 31, 2026 4:31 సాయంత్రం

test description

ఇవాళే కొత్త సంవత్సరం వచ్చింది. అర్ధరాత్రి నుంచే శుభాకాంక్షల మెసేజీలు వెల్లువెత్తాయి. కొత్త సంవత్సరపు తొలిపొద్దు పొడవగానే నా జీవితంలో క్రాంతి రావాలని, నా ఆలోచనలు మారాకు వేసి, మరిన్ని మార్పులకు స్వాగతం పలకాలనీ వారంతా అభిలషించారు. తెల్లవారింది. పాత సంవత్సరంలో ఆఖరి రోజున చేసినట్లుగానే– ఓ గ్లాసు గోరువెచ్చని నీటిలో ఓ చెంచా తేనె, చిటికెడు దాల్చిన చెక్క పొడి, పసుపు, మెంతులు వేసుకుని తాగాను. అచ్చం నిన్నటిలాగే హార్లిక్స్ సేవనం, మార్నింగ్ వాక్, కాస్త స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజులు, స్నానం, అల్పాహారం, పడక్కుర్చీలో నడుం వాల్చి, లోకపు తీరు గురించి ఆలోచనలో పడడం... అంతా సేమ్ టు సేమ్! మార్పెక్కడుంది? క్యాలెండరులో మరో పేజీ చిరిగింది అనేవారు పాతకాలపు కథల్లో. ఈ రోజుల్లో గోడలకు క్యాలెండర్లు లేవు. సెల్‌ఫోన్‌లోనే డేటు చూస్తాం. అది తనంతట తనే మార్చేసుకుంటుంది. చించే, ఆలోచించే పని మనకు పెట్టదు. మరి పెనుమార్పు వచ్చేస్తుందని ఆకాంక్షించిన నా బంధుమిత్రుల మాటేమిటి? ఇంతకీ ఈ మార్పు వున్నట్టా? మరి లేనట్టా? ప్రబంధ నాయిక నడుముకు వచ్చిన సమస్యే మనకూ వచ్చినట్లుగా వుంది. గ్రీకు తత్త్వవేత్త హెరాక్లిటస్‌ అంటాడు– ‘ఒకే నదిలో రెండుసార్లు కాలు పెట్టలేవు’ అని. అంటే మొదటిసారి కాలు పెట్టి, బయటకు తీసి, మళ్లీ పెట్టే లోపున పాత నీరు వెళ్లిపోతుంది. కొత్త నీరు వచ్చేస్తుందని అర్థం. చూడడానికి పాత నీరులాగే అనిపిస్తుంది కానీ, నిజానికి అది కొత్త నీరు. దానికీ, దీనికీ లింకు ఉంది కానీ, దేని అస్తిత్వం దానిదే. రెండూ ఒకలాంటివి కావు. 1940–60ల మధ్య కాలంలో పుట్టిన వారికున్న అడ్వాంటేజీ ఏమిటంటే... వాళ్లు కనీసం ఆరు వేర్వేరు దశాబ్దాలు, రెండు వేర్వేరు శతాబ్దాలు, రెండు వేర్వేరు సహస్రాబ్దాలను చూశారు. కాలచక్రపు తానులో ఈ ఆరు దశాబ్దాల కాలాన్ని ఒక కట్‌పీస్‌గా తీసి చూస్తే దీనిలో ఉన్నంత వర్ణ వైవిధ్యం తక్కిన ఏ ఆరు దశాబ్దాల కట్‌పీస్‌లోనూ కనబడదు. ఏం మార్పు! ఏం మార్పు!!

Posted by: పోస్ట్ చేసినవారు: Person - 8x Namburux ప్రసాద్x నంబూరుx
on January 01, 2026 తేదీ జనవరి 1, 2026
Reactions
స్పందనలు

Login to react to this event

ఈ ఈవెంట్‌కు స్పందించడానికి లాగిన్ అవ్వండి

Event Details ఈవెంట్ వివరాలు
Type: రకం: House Warming గృహప్రవేశం
About: గురించి: Siva Rama Krishna Prasad Bodepudi (Krishna) S/o Nageswara Rao Bodepudi శివ రామ కృష్ణ ప్రసాద్ బోడేపూడి (కృష్ణ) S/o నాగేశ్వర రావు బోడేపూడి